శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): క్రిస్మస్ పండుగ నేపథ్యంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కల్వరి టెంపుల్ వద్ద ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు. ఈ మేరకు క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో జోనల్ ఏడీసీపీ, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.






