వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ ఎ బ్లాక్ లో జీహెచ్ఎంసీ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, నాయకుడు మాధవరం రామారావులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన సిబ్బంది డివిజన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. డివిజన్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పేరుకుపోయిన మట్టి తొలగింపు, చెత్త తరలింపు వంటి కార్యక్రమాలను అదనపు సిబ్బంది సహాయంతో కొనసాగిస్తున్నామని తెలిపారు.

డివిజన్ వాసులు తమ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలు తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, శాసన సభ్యుల ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను మరో వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు తెలిపారు. మిషన్ మోడ్ పద్దతిలో చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కోసం అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ నాగేశ్వర్ నాయక్, ఎస్ఎఫ్ఏ లు తులసీదాస్, రవీందర్, నాయకులు అరుణ్, సోమయ్య, వీరస్వామి, నర్సింగ్ రావు, క్రాంతి కుమార్, నాయినేని రాము, డి.శ్రీను, చందు ముదిరాజ్, వెంకట్ రెడ్డి, పవన్, రామ్మూర్తి, శోభ, రమ, శ్రీను, రాజలమ్మ పాల్గొన్నారు.