- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలోనూ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం మాదాపూర్ డివిజన్ లో రూ.10 కోట్ల 88 లక్షల 80 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, మాతృశ్రీ నగర్, ఆదిత్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, శ్రీ బాగ్ కాలనీ, ఘనశ్యామ్ సూపర్ మార్కెట్, సూర్య ఎలైట్, అపర్ణ రోడ్, శ్రావ్య ఆలయ, ఖానామెట్, ఇజ్జత్ నగర్, చంద్రానాయక్ తండా, అరుణోదయ కాలనీ, మాదాపూర్ విలేజ్, అయ్యప్ప సొసైటీ, సాయినగర్, కాకతీయ హిల్స్, కావూరి హిల్స్, వసంత్ సిటీలలో చేపట్టబోయే పార్క్ సుందరీకరణ పనులు, శ్మశాన వాటికలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులు, వీడీసీసీ రోడ్డు, సీసీ రోడ్డు, సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ అభివృద్ధి పనులను చేపట్టడం ఆపలేదన్నారు. పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, వారికి మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రూపా దేవి, ఏఈ ప్రశాంత్ , వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు, గుమ్మడి శ్రీను, రాంచందర్, బ్రిక్ శ్రీను, సంజీవ రెడ్డి, అనిల్, అప్పారావు, శివాజీ, సాంబయ్య, భిక్షపతి, మధుసూదన్ రెడ్డి, బృందారావు, బాబు మియా, అబ్దుల్, కాజా, సలీం, బాబూమియా, లావణ్య, ఉమ, యాదమ్మ, సీత, కాలనీ వాసులు ఠాగూర్, చిన్నా, కామేశ్వరరావు, మోహన్, చైతన్య పాల్గొన్నారు.