వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీ కార్యకర్తల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో తెరాస నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెరాస సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై తెరాసలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఎంవీ ప్రసాద్, సత్యనారాయణ, పారునంది శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి, హన్మంతరావు, అరుణ, కుమారి పాల్గొన్నారు.
