ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన ప‌లు కాల‌నీల వాసులు

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి)‌: మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నవభారత్ నగర్ కాలనీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సాదిక్, చైర్మన్ అనంతయ్య, నాయకులు నూరుద్దీన్, అలీ, బషీర్, శ్రీనివాస్ గౌడ్, చౌదరి, ఖలీల్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన నవభారత్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని గోకుల్ ప్లాట్స్ వాసుల విన‌తి…
మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని గోకుల్ ప్లాట్స్ వాసులు త‌మ కాల‌నీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు ఎర్ర‌గుడ్ల శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి గురువారం విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సందర్బంగా గాంధీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గుమ్మడి శ్రీను, బ్రిక్ శ్రీను, స్థానికులు పాల్గొన్నారు.

స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న గోకుల్ ప్లాట్స్ వాసులు

గాంధీని క‌లిసిన రాంనరేష్ నగర్ కాలనీ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు..
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేష్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాంనరేష్ నగర్ కాలనీలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నక్క శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి, జనరల్ సెక్రెటరీ సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ మహెందర్ రెడ్డి, తెరాస పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని క‌లిసిన రాంనరేష్ నగర్ కాలనీ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here