- 88 పరుగులకే చేతులెత్తేసిన విజయానంద్ జట్టు
శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): హెచ్‌సీఏ డివిజన్ వన్ డే లీగ్ చాంపియన్‌షిప్ క్రికెట్ పోటీల్లో భాగంగా సదరన్ స్టార్స్‌కు విజయానంద్ జట్లకు మధ్య జరిగిన మ్యాచ్‌లో సదరన్ స్టార్స్ జట్టు 199 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బృందా క్రికెట్ గ్రౌండ్ 2లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సదరన్ స్టార్స్ జట్టు 43.3 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సదరన్ స్టార్స్ జట్టు బ్యాట్స్‌మన్ పి.ఇషాన్ నారాయణ్ రెడ్డి 94 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్‌తో 93 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన విజయానంద్ జట్టు 22.5 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ అయింది. 9 ఓవర్లు వేసిన ఇషాన్ నారాయణ్ రెడ్డి 26 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. సదరన్ స్టార్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.