శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా ఆ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శేరిలింగంపల్లిలోని రాజకీయ అంశాలపై కొద్ది సేపు ముచ్చటించినట్లుగా ఆయన వెల్లడించారు. బీసీ ఉద్యమంలో ముందుండి పోరాడాలని, పార్టీ కూడా అదే స్ఫూర్తితో పని చేస్తుందని ఎమ్మెల్సీ కవిత సూచించారన్నారు. తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా కృషి చేయాలని కోరినట్లుగా రవీందర్ యాదవ్ వెల్లడించారు.