శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హేమ సాయి లేక్ టవర్స్ అపార్టుమెంట్స్ లో రూ. 53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 116 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రకృతి సహజ సిద్ధమైన వనరులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, తరిగిపోతున్న వనరుల తరుణంలో సహజ సిద్దమైన సౌర శక్తిని వాడుకొని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రిప్రగడ సత్యనారాయణ రావు , హేమ సాయి లేక్ వ్యూ టవర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ హరీష్ దామరాజు, వైస్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, సెక్రెటరీ శ్రీనివాస్ వోలెటి, ట్రెజరర్ రాజన్ బాబు, జాయింట్ సెక్రటరీ పరిమల్ సహు, అడిషనల్ సెక్రెటరీ ప్రతాప్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.