శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై, పలు సమస్యలపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తో చర్చించారు.ఈ కార్యక్రమం లో ఎస్ సి శంకర్ నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి, సీనియర్ నాయకులు శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.