నమస్తే శేరిలింగంపల్లి: మట్టి వినాయకులను మాత్రమే పూజించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని జై గణేశ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి జగదీష్ పటేల్ పిలుపునిచ్చారు. రాబోయే వినాయక చవితి పండగకు ప్రతి ఒక్కరం మట్టి వినాయకులను పూజించాలన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు దూరంగా ఉండి కాలనీల్లో, గల్లీల్లో, ఇళ్లల్లో మట్టితో తయారు చేసిన ప్రతిమలకే ప్రధాన్యత ఇచ్చి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. పీఓపీ వద్దు మట్టి గణపతే ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.






