నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను నోవాటెల్ హోటల్ లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. జూలై 2,3 తేదీల్లో హెచ్ఐసీసీలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న దృష్ట్యా దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ సింగాయపల్లి గోపి, మాదాపూర్ డివిజన్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు మన్నే రమేష్ తో కలిసి సభా వేదిక, భోజన వసతి, పార్కింగ్, ఫొటో ఎగ్జిబిషన్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.