నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్నాడు. ఐతే గతేడాది కరోనా ఉదృతి మొదలైన నాటి నుంచి తను కోవిడ్ బారిన పడేంతవరకు జగదీశ్వర్ గౌడ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. నిత్యావసర సరుకుల పంపిణి, మందుల పంపిణి, అన్నదానాలు, రక్తదానాలు లాంటి సేవ కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టి తన డివిజన్ తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన అభిమానులు జగదీశ్వర్ గౌడ్ చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. మాకు ఏ కష్టమొచ్చినా కన్నీల్లొచ్చినా కరోనా వచ్చినా… నేనున్నానంటూ అభయమిస్తూ… నిరంతరం ప్రజల మధ్యనే ఉండే జగదీషుడా నీకు రుణపడి ఉంటుంది ప్రజానీకం… అంటూ పేర్కొన బడిన సదర్ పోస్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే జగదీశ్వర్ గౌడ్ కు చెందిన వందల మంది అభిమానులు సదరు చిత్రాన్ని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లలో పోస్ట్ చేస్తుండటంతో శేరిలింగంపల్లిలో అది ట్రెండిగ్ గా మారింది.