ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌తో స‌మావేశ‌మైన‌ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి… రంజాన్ తోఫా పంపిణీపై స‌మీక్ష‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో స్థానిక కార్పొరేట‌ర్ రెడ్డి మంజుల ర‌ఘునాథ్ రెడ్డి గురువారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. రంజాన్ ప‌విత్ర‌ మాసంలో ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సోదరులకు ఇచ్చే రంజాన్ తోఫా విష‌య‌మై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంజుల ర‌ఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తేలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ వర్గాల పేద ప్రజలకు అండగా ఉంటూన్నార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం నుంచి చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ చేస్తామ‌ని అన్నారు. క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ రంజాన్ దుస్తూల‌ను స్వీక‌రించాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, నాయకులు అక్బర్ ఖాన్, మెయిజ్, అంజద్, సయ్యద్ పాషా, మెయినోద్దిన్, సాయాబ్ పటేల్, వసిం, ముసా తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం మ‌త‌పెద్ద‌ల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here