నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్ కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి జి.హెచ్.ఎం.సి అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీంతో బుదవారం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సిబ్బంది రంగంలోకి దిగి శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్‌టీఆర్ నగర్‌లోని వీదులన్నింటిలో, అడుగడుగున హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ బస్తీవాసులు ధైర్యంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను ఎదుర్కొకాలని పిలుపునిచ్చారు. ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు, విట్టల్ గారు, విజయ్ బాసనీ గారు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.