కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట్లు అడిగే హక్కే లేదు: కొండా విశ్వేష్వ‌ర్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలిలోని ఎస్ఎన్‌రెడ్డి గార్డెన్స్‌లో గురువారం కాంగ్రెస్‌పార్టీ శేరిలింగంప‌ల్లి నియోజక‌వ‌ర్గం కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. చేవెళ్ల మాజి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కో ఆర్డినేటర్ మన్నే సతీష్ , శేరిలింగంప‌ల్లి స‌మ‌న్వ‌య‌క‌ర్త ర‌ఘునంద‌న్‌రెడ్డిలు పాల్గొన్నారు. రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అనుస‌రించాల్సిల అంశాల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న‌, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల‌కు ఓట్లు అడిగే హక్కే లేద‌ని, రాష్ట్రంలో నిరుద్యోగులను నిలువునా ముంచింది టీఆర్ఎస్ పార్టీ అని మండిప‌డ్డారు. చదువుకున్న యువకులు ఆలోచించి ఓటు వేయాల‌ని విజ్జ‌ప్తి చేశారు. పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి అభ్య‌ర్థి సైతం క‌రువ‌య్యార‌ని, విధిలేని ప‌రిస్థితిలో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు కూతురిని తెర‌పైకి తెచ్చార‌ని అన్నారు. గ‌త ఆరేళ్లుగా గుర్తుకు రాని వాణిదేవి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో విజ్ఙులు అర్థం చేసుకుని త‌మ ఓటు వేయాల‌ని సూచించారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న కొండా విశ్వేష్వ‌ర్‌రెడ్డి, వేధిక‌పై పొన్నం ప్ర‌భాక‌ర్‌, అభ్య‌ర్థి చిన్నారెడ్డి, మ‌న్నే స‌తీష్‌, ర‌ఘునందన్ రెడ్డి

ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ బృతి కింద ఇవ్వవలసిన రూ.74 వేలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను గెలిచిన తర్వాత 3 నెలలలో నిరుద్యోగ భృతి ఇవ్వక పోతే ప్రగతి భవన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని అన్నారు. మన్నే సతీష్, ర‌ఘునంద‌న్‌రెడ్డిలు మాట్లాడుతూ 43 సంత్సరాల అనుభవం ఉన్న చిన్నా రెడ్డి ని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే గొంతుగా మార్చాల‌ని ప‌ట్ట‌భ‌ద్రుల‌కు పిలుపునిచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్సీ ఓటర్లు 24 వేలు ఉ న్నారని ప్రతి ఒక్కరినీ కలిసి చిన్నారెడ్డికి ఓటు వేసేలా ఒప్పించాల‌ని శ్రేణుల‌కు సూచించార‌. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పోటిచేసిన‌ కార్పొరేటర్ అభ్య‌ర్థులు రేణుక, మహిపాల్ యాదవ్, నగేష్, భరత్ గౌడ్, సీనియర్ నాయకులు నిజామోద్దీన్, రాజన్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here