చందానగర్ లో సీతారామ్ ఏచూరి మొదటి వర్ధంతి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): CPI(M) అఖిల భారత మాజీ కార్యదర్శి సీతారామ్ ఏచూరి వర్ధంతి సందర్భంగా చందానగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏచూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా cpi(m) శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి C శోభన్ మాట్లాడుతూ దేశం గర్వించ దగ్గ మహా నాయకుడు సీతారామ్ ఏచూరి అని అన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేస్తూ కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ స్థాయికి చేరుకుని జీవితాంతం ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. మతతత్వ పాలనకు వ్యతిరేకంగా దేశంలో ఒక ప్రత్యామ్నాయ కూటమికి రూప కల్పన చేయటంలో ఆయన పాత్ర అమోఘం అని అన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, మత ఛాందస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ఆయన ఆశయ సాధనకు కృషి చేసినట్టు అని అన్నారు. రాబోయే రోజుల్లో ఏచూరి స్పూర్తితో మరిన్ని ఉద్యమాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో CPI(M) జోన్ నాయకులు V మాణిక్యం, K కృష్ణ, V.మల్లి కార్జున్, సయ్యద్ ముజా మిల్, అశోక్, సాయిలు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here