భార‌తీయ జ‌న‌త యువ‌మోర్చ సిద్ధిపేట జిల్లా ఇన్చార్జ్‌గా రాగిరి సాయిరాం గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త యువ‌మోర్చ‌ సిద్ధిపేట జిల్లా ఇన్చార్జ్‌గా శేరిలింగంప‌ల్లికి చెందిన బిజెవైఎం రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు రాగిరి సాయిరాం గౌడ్ నియ‌మితుల‌య్యారు. బిజెవైఎం రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాష్ మంగ‌ళ‌వారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు బిజెవైఎం ఇన్చార్జ్‌ల‌ను నియ‌మిస్తూ అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఈ క్ర‌మంలో సిద్ధిపేట జిల్లాకు రాగిరి సాయిరాం గౌడ్‌ పేరు ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా సాయిరాం గౌడ్ మాట్లాడుతూ త‌న‌పై నమ్మకం ఉంచి సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లాకు బీజేవైఎం ఇంచార్జ్‌గా భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బిజెవైఎం తెలంగాణ రాష్ట్ర‌ అధ్య‌క్షులు భాను ప్రకాష్, రాష్ట్ర బీజేవైఎం ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్‌ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో యువ‌త‌ను ఏకం చేసి, సీనియ‌ర్ బిజెపి నాయ‌కుల స‌ల‌హాలు సూచ‌న‌లు పాటిస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని అన్నారు. సిద్ధిపేట గ‌డ్డ‌పై కాషాయ జెండా రెప‌రెప‌లే ల‌క్షంగా ముందుకు సాగుతాన‌ని పేర్కొన్నారు.

బిజెవైఎం రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, సిద్ధిపేట జిల్లా ఇన్చార్జ్‌ రాగిరి సాయిరాం గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here