నాలుగేళ్ళ చిన్నారితో కామాందుడి అసభ్య ప్రవర్తన

  • న్యూ హ‌ఫీజ్‌పేట్‌లో గుర్తు తెలియని యువకుడి ఘాతుకం
  • నిందితుడి కోసం గాలిస్తున్న మియాపూర్ పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి: కిరాణ షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న నాలుగేళ్ళ చిన్నారిపై ఓ గుర్తు తెలియని యువకుడు అసభ్య ప్రవర్తనతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, బాధితుల కథనం ప్రకారం…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ ఇంటీరియర్ డిజైనర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హ‌ఫీజ్‌పేట్‌  మార్తాండ్ నగర్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా సోమవారం మధ్యాహ్నం సమయంలో అతడి కుమార్తె(4) చాక్లెట్లు తెచ్చుకోవడానికి స్థానికంగా దుకాణానికి వెళ్లింది. కాగా ఇంటికి తిరిగి వస్తుండగా ఓ గుర్తు తెలియని యువకుడు ఆ చిన్నారిని సమీపంలోని అపార్ట్ మెంట్ లోకి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొద్దిసేపటి అనంతరం యువకుడు  అక్కడినుండి వెళ్లిపోగా ఇంటికి వెళ్లిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు మియాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్టుమెంట్ లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. సదరు యువకుడు బాలికతో చేసిన అసభ్య చేష్టలు కెమెరాల్లో రికార్డు కావడంతో, దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం సమీప ప్రాంతాల్లో గాలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here