నల్గొండ (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్, మండల అధ్యక్షుడు వెంకటయ్య యాదవ్, స్థానిక యాదవ సంఘం అధ్యక్షుడు తిరుపతయ్య యాదవ్ ల ఆధ్వర్యంలో సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. దిండి మండలంలో జరిగిన ఈ కార్యక్రమానికి అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సంఘం భవన నిర్మాణానికి తన వంతుగా రంగారెడ్డి జిల్లా తరఫున రామచందర్ యాదవ్ రూ.11 వేల విరాళం ప్రకటించారు.
అనంతరం రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భవన నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. యాదవ విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న దిండి మండలం యాదవ సంఘం సభ్యులకి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి మండలంలో యాదవ విద్యార్థులకు వసతి గృహం నిర్మించాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తేవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గొర్ల కాపర్ల సొసైటీ సంఘం అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, గోవర్ధన్ యాదవ్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు లాలూ యాదవ్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య యాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ జీడి కంటి మహేందర్ యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు అందెల సత్యనారాయణ యాదవ్, నాగపురి శ్యామ్ యాదవ్, వివిధ జిల్లాల, మండలాల యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.