రైతు చ‌ట్టాల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలి: సురేష్ నాయక్

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సురేష్ నాయక్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిర‌స‌న‌గా ఆ పార్టీ నాయ‌కులు మంగ‌ళ‌వారం రాజ్ భవన్ ముట్టడి చేపట్టారు. ఈ సంద‌ర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక, అన్నం పెట్టే రైతన్నల డిమాండ్లను పట్టించుకోకుండా బిజెపి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్ర‌వ‌ర్తిస్తుంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్ర‌భుత్వం జీవోలను విడుదల చేసి అన్నం పెట్టే రైతన్నకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేసేది పోయి, రైతు పొట్టగొడుతూ, వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేక‌పోతే వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి డి. నగేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతున్న సురేష్ నాయ‌క్‌, కాంగ్రెస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here