- జాతీయ బీజేపీ ఓబీసీ మెర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సామాజికంగా వెనుకబడిన శిష్టకరణ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని జాతీయ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ జాతీయ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం హైదరాబాద్ అధ్యక్షుడు డీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శనివారం డాక్టర్ లక్ష్మణ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న శిష్టకరణాలకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ ఇవ్వాలనే ఆంశాన్ని డాక్టర్ లక్ష్మణ్ తో చర్చించారు.
అందుకు సానుకూలంగా స్పందించిన డాక్టర్ లక్ష్మణ్ త్వరలోనే శిష్టకరణ సామాజిక వర్గ ఓబీసీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పార్లమెంట్ లో ఓబీసీ బిల్లు ఆమోదం కోసం తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు డీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సీనియర్ సభ్యుడు డాక్టర్ వళాభరణం కృష్ణమోహన్ లని కలిసి తమ వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్, అడిషనల్ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు, డొంకాడ అనంత ప్రసాద్, కోశాధికారి ఉరిటి పార్వతీశ్వరరావు, సీహెచ్ దుర్గా ప్రసాద్, మహిళా విభాగం కార్యదర్శి అరసాడ సత్యలక్ష్మీ, పార్ధసారథి, పట్నాయకుని సూర్య ప్రకాశరావు, కొట్టక్కి వెంకటేశ్వరావు టి. ప్రతాప్ రాజ్, రబి కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు.
