నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో 11 రోజుల పాటు నిర్వహించిన బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ ముగిసింది. బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన పలు హస్తకళా ఉత్పత్తుల స్టాల్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మిస్టర్ పాట్రిక్ అకార్డియన్ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ పై సంగీతాన్ని వినిపించారు. సురేఖ ప్రసాద్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. మూషిక వాహన, శ్రీ విజ్ఞ రాజాం భజేయ, ముద్దుగారేయ్ యశోద, కొండలలో నెలకొన్న, స్వలా జాతి, శివపాదం, గణేశా స్తుతి, కనకానం, తిల్లాన, రుద్రాష్టకం, భస్మాసుర నృత్య రూపకం అంశాలను శృతి, హారిక, రమ్య, మేఘన, దివ్య, శ్రీమై, పావని, వేద, లాస్య శ్రీ తదితరులు ప్రదర్శించి మెప్పించారు.