కల్వర్టు నిర్మాణం పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని, నాలాల పక్కన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద గల ప్రీతి హాస్పిటల్ పక్కన గల నాలా పై ఒక కోటి డెబ్భై లక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతి నాలా వద్ద ఫెన్సింగ్ చేసి రక్షణ చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, చింతకింది రవీందర్, వెంకటేష్ గౌడ్, కృష్ణ యాదవ్, నాగరాజు, నరేందర్ బల్ల, హరీష్ రెడ్డి, మల్లేష్ గౌడ్, కార్తీక్ గౌడ్, సందీప్ రెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.

బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here