నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహించిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సైనృత్య అకాడమీ టెక్సాస్, యూ ఎస్ ఏ శ్రీదేవి యడ్లపాటి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. శాశ్వతి బనెర్జీ శిష్య బృందం సభ్యులు చేసిన కథక్ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. టెక్సాస్ లో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న దివ్య స్ఫూర్తి, దాక్షాయణి, శ్రావ్య, సంజన, జస్మితా కళాకారులు బ్రహ్మాంజలి, రామాయణ శబ్దం, అదిగో అల్లదిగో, ఇదిగో భద్రాద్రి , ముద్దుగారేయ్ యశోద, జనుత శబ్దం, తదితర అంశాలను ప్రదర్శించి అందరిని మెప్పించారు. శాశ్వతి బనెర్జీ శిష్య బృందం గురు వందన, దాద్రా, ప్రార్ధన, తుమ్మేటి, తరణ తదితర అంశాలను మైత్రేయి, అద్విక, ఇషితా, ప్రిశ, కృతిక తదితరులు ప్రదర్శించారు. కారిణి విచ్చేసి ప్రదర్శించిన కళాకారులను ప్రోత్సహించారు.
