నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ రెడ్డి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్స్ రెడ్డి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు విఢతల వారీగా అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వాసులు కరిముల్లా, శివయ్య, హరికృష్ణ, రామారావు, బుచ్చయ్య చౌదరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
