నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్ప ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ చతుర్థ బ్రహ్మోత్సవాలు రెండవరోజు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు వేదుల పవన్‌కుమార్ శర్మ బృందం పర్యవేక్షణలో సోమవారం మహా మృత్యుంజయపాతుపశ హోమం, నిత్యహోమాలు, శ్రీలక్ష్మీగణపతికి సహస్త్రనామార్చన, గరికపూజ, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తీ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ.రమణమూర్తి, పాలకమండలి సభ్యులతో పాటు పరిసర ప్రాంత భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

