డ్రైనేజీ మళ్లింపు పట్ల కాలనీవాసులకు ఇబ్బందులు – కాలనీవాసులకు బిజెపి నాయకుల మద్దతు

నమస్తే శేరిలింగంపల్లి: లింగంకుంట ఎస్టీపీ మురికినీటిని శంకర్ నగర్ కాలనీ మీదుగా మళ్లించటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తికి లాభం చేకూర్చేలా కాలనీ మెయిన్ రోడ్డు నుండి డ్రైనేజీ పైప్ లైన్ వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ శంకర్ నగర్ కాలనీ వాసుల పిలుపు మేరకు పాల్గొన్న బిజెపి శేరిలింగంపల్లి నాయకులు పర్యటించారు. గత 100 సంవత్సరాలుగా లింగంకుంట చెరువు నీరు వెళ్తున్న మార్గాన్ని మళ్లించి ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం అధికారులు, ప్రజాప్రతి‌నిధుల సహకారంతో కాలనీలకు మళ్లించడం సరికాదన్నారు.

కాలనీ వాసులతో కలిసి పర్యటిస్తున్న బిజెపి నాయకులు

ఈ పైప్ లైన్ వేయటం వలన నాలుగు కాలనీల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. శంకర్ కాలనీ వాసులకు జరుగుతున్న అన్యాయానికి బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు సంఘీభావం తెలిపి పరిస్థితిని సమీక్షించారు. శంకర్ నగర్ కాలనీ మధ్య నుండి మెయిన్ రోడ్ ద్వారా నాలాలకు మళ్లించడంతో శంకర్ నగర్, భవాని శంకర్ కాలనీ, శంకర్ నగర్ ఫేస్ 2, న్యూ శంకర్ నగర్ వాసులు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా కోటి రూపాయల నిధులు మంజూరు చేసి ఒక ప్రైవేట్ వ్యక్తికి అనుకూలంగా చేయటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాలనీ వాసులకు మద్దతుగా బిజెపి ఉందని, దీని కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు కాలనీ ల వాసులు చందర్ రావు, మానయ్య, బసవ రాజు, రామారావు, బాబు, కృష్ణ మూర్తి, ఏల్.పి.రావు, ఉమ, మహేశ్వర రావు, పార్థసారథి, ఏస్.ఏస్.రావు, మల్లికార్జున్ రెడ్డి, వెంకట్ రాజు, సదానందం, నాగసత్యం, శ్రీనివాస్ గౌడ్, రామాంజనేయులు, ఏవిఎస్ శ్రీనివాస్, శ్రీనివాస్ రాజు, శ్రీనివాస్, కొండయ్య, సంధ్య, కాలనీ వాసులతో పాటు బిజెపి డివిజన్, నియోజకవర్గం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here