హుక్కా సెంటర్ పై రాయదుర్గం పోలీసుల దాడి – 9 మంది యువకులు అరెస్టు, హుక్కా సామాగ్రి స్వాధీనం

నమస్తే శేరిలింగంపల్లి: మణికొండలో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్ పై రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించి 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ 9 స్టార్ హిల్స్ అపార్ట్మెంట్ లో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో రాయదుర్గం పోలీసులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో దాడులు జరిపారు. 9 మంది యువకుల‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 7 వేల విలువ చేసే 6 హుక్కా పాట్స్, 6 డబుల్ యాపిల్ ప్లేవర్స్, 12 హుక్కా పైపులను, మూడు కోల్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

హుక్కా సెంటర్ దాడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here