చ‌లివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని TNGOS కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను శాసన మండలి తొలి చైర్మన్ స్వామి గౌడ్, డీసీ సేవా ఇస్లావత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు, బాటసారులకు అందచేశారు. ఈ  సందర్బంగా గాంధీ మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here