ఉత్త‌మ ఆర్తో వైద్యుడిగా డాక్ట‌ర్ పుట్ట రాజ్‌కు అవార్డు ప్ర‌దానం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీహెచ్ఈఎల్ జనరల్ ఆసుపత్రిలో రెండు దశాబ్దాలుగా ఆర్థోపెడిక్ వైద్యుడిగా విధులను నిర్వహిస్తూ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న వైద్యరత్న అవార్డు గ్రహీత డాక్టర్ పుట్ట రాజ్ ఉత్తమ ఆర్తో వైద్యుడిగా ఎంపికై అవార్డును అందుకున్నారు. నిత్యం అందిస్తున్న వైద్య సేవలకు గుర్తింపుగా గతంలో పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చే ఉత్తమ వైద్యుడిగా అవార్డులను అందుకున్నారు. ఆరోగ్య రక్షణ పై రాసిన పుస్తకాలు యువత వ్య‌స‌నాలకు బానిసలు కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, గ్రామాల్లో చేపట్టిన ఉచిత వైద్య సేవలకు గుర్తింపుగా కర్ణాటక మీడియా క్లబ్ అసోసియేషన్, కర్ణాటక రాష్ట్ర సోషల్ కల్చరల్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యుల జాతీయ సదస్సులో పుట్టరాజుకు వైద్యరత్న అవార్డును అంద‌జేశారు. శనివారం రాత్రి నగరంలో పార్క్ హయత్ లో జరిగిన గ్లోబల్ లీడర్షిప్ వేడుకల్లో ప్రఖ్యాత నటి జయప్రద చేతుల మీదుగా ఆయనను ఘనంగా సన్మానించి ఉత్తమ ఆర్తో అవార్డును అందించారు. ఉత్తమ ఆర్తో వైద్యుడిగా అవార్డును అందుకోవడం పట్ల బీహెచ్ఈఎల్ యాజమాన్యం, పలువురు ఉన్నతాధికారులు కార్మికులు, వైద్యులు పుట్ట రాజ్ కు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here