అహింస ప‌ర‌మో ధ‌ర్మఃను గుర్తు చేస్తున్న జైన మ‌తం బోధ‌న‌లు: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జైన మతం శాశ్వత బోధనలు మనకు అహింస పరమో ధర్మః అనే సూత్రాన్ని గుర్తు చేస్తున్నాయని, అహింసే అత్యున్నత ధర్మం, విభేదాలు, అసహనం పెరుగుతున్న ఈ ప్రపంచంలో ఈ సందేశం నేటికంటే మరింత ప్రాముఖ్యత సంతరించుకుంద‌ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ మజీరా రోడ్డులో జైన అహింస స్తంభం శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మనం కేవలం ఒక నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కాదు, మ‌నుష్యత్వానికి ఒక నైతిక పునాది వేస్తున్నాం అని అన్నారు. మనం ప్రారంభిస్తున్న ఈ అహింస స్తంభం కేవలం రాయి నిర్మాణం మాత్రమే కాద‌ని, ఇది శాశ్వత సత్యానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణమూర్తి, బాలింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, శాస్త్రి, రంగారావు, రాంబాబు, సాయి యాదవ్, జైన్ కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here