శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి తనయులు, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం వృద్ధుల, అనాధ పేద బాలికల ఆశ్రమంలో కేక్ కట్ చేయించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వారందరూ రాగం దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వృద్ధులు, పేద బాలికలు పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, మహేందర్ సింగ్, కిరణ్ యాదవ్, రాజు, భరత్ గౌడ్, రేవంత్, సలీం, వినయ్, రఘు, హరీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






