శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ రోడ్ నం.7 మాదాపూర్లోని స్మార్ట్ పెరల్స్ ప్రీ స్కూల్లో మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమ్మర్ క్యాంప్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా చిన్నారులు తమ తల్లులపై ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ నృత్యాలు, పాటలు, వినోదాత్మక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నిర్వహించిన పాద పూజ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. చిన్నారులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకోవడం చూసి పలువురు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారులకు ఇలాంటి భారతీయ సంస్కారాలు, విలువలు నేర్పించడం ఎంతో అభినందనీయమని తల్లిదండ్రులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పల్లేరుమూడి సత్యవతి, వరలక్ష్మి, అరుణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






