నమస్తే శేరిలింగంపల్లి: కొంగర కలాన్ లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కొంగర కలాన్ వరకు 300 కార్లతో భారీ ర్యాలీగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మియాపూర్ క్యాంపు కార్యాలయం వద్ద వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఎంతో ముందుచూపుతో పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలని భావించి ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలో 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు.
33 కొత్త జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్లను నిర్మించారన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో ఒకే చోట జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం ద్వారా ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడుతాయన్నారు. ర్యాలీలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు అశోక్ గౌడ్, మాధవరం రంగారావు, రవీందర్ ముదిరాజ్, ఆయా డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, సమ్మారెడ్డి , మారబోయిన రాజు యాదవ్, గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గౌడ్, రాజు నాయక్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, ఆయా డివిజన్ల గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.