బండి సంజయ్ కు సంఘీభావం తెలిపిన బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని చందానగర్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు బొబ్బ నవత రెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ లోని ఆయన స్వగృహంలో బొబ్బ నవత రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. అక్రమ అరెస్టులు, కేసులతో బిజెపి నాయకులు భయపడరని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

బండి సంజయ్ ను కలిసి సంఘీబావం తెలుపుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, తదితరులు

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here