శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): జూలై 23న నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని పలు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో AIFDS, AISF, SFI విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉప అధ్యక్షుడు గ్యార క్రాంతి, జిల్లా నాయకుడు పవన్ చౌహాన్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి శంకర్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా నాయకుడు యం.శ్రీకాంత్, వంశీ, ధర్మతేజ, నితీష్, పవన్ పాల్గొన్నారు.