శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారథ్యంలో శనివారం నిర్వహించిన నృత్యార్చన కార్యక్రమం కళాభిమానులను ఆకట్టుకుంది. సంచలనా నృత్య పాఠశాల గురువు పద్మా కళ్యాణి నేతృత్వంలో శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. కార్యక్రమాన్ని విజ్ఞాన వినాయక కౌతంతో ప్రారంభించిన శిష్య బృందం అనంతరం అదివో అల్లదిహో, శిరుత నవ్వులవాడే, ముద్దుగారే యశోద, కులుకగ నడవరో, కొండలలో నెలకొన్న, అలరులు, దేవదేవం భజే, భావములోని, జగడపు తదితర అన్నమాచార్య కీర్తనలకు అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందించారు. ఈ ప్రదర్శనల్లో ఇ. అక్షర, జి. అక్షర, జె. తేజస్విని, కృతిక, నక్షత్ర, నికిత, సుష్మ, శాన్వి, యశస్విని, చిన్మయి, శ్రావ్య, తన్వి, సంజన, మేఘన, సృజని, ద్విష, సహస్ర, ప్రణవి పాల్గొని తమ నృత్య ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమం అనంతరం ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.






