చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రన్నింగ్, జంపింగ్, త్రో, వాకింగ్ విభాగాల్లో స్త్రీ, పురుష క్రీడాకారులు 70 మంది పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. కాగా రంగారెడ్డి జిల్లా అసోసియేషన్‌కు చీఫ్ ప్యాట్రన్‌గా గుడ్ల ధనలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కమిటీ జీవిత అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ పటిష్టమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన క్రీడాకారులకు సోమవారం నుంచి నిత్యం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని, ఈ శిక్షణలో క్రీడాకారులు పాల్గొనాలని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్, కోశాధికారి లక్ష్మి, విజయలక్ష్మి, రాజు చింతల, జిల్లా కమిటీ కోశాధికారి శ్రీనివాస్ ముదిరాజ్, ఏకరత్నం, డగ్లస్ పాల్గొన్నారు.