చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడిగా చందానగర్ కు చెందిన కొండా విజయ్ కుమార్ ను అద్యక్షుడు మర్రి లక్ష్మా రెడ్డి నియమించారు. చందానగర్ పిజెఅర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ కుమార్ కు భాద్యతలు అప్పగించారు. వచ్చే నెల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలు మేడ్చల్ జిల్లాలో నిర్వహించనున్నట్లు మర్రి లక్ష్మా రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న తనకు రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం పట్ల కొండా విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అథ్లెట్స్ ను మరింత ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. తనకు రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వడం పట్ల మర్రి లక్ష్మా రెడ్డితోపాటు కమిటీ సభ్యులకు కొండా విజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.