శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ఏషం మల్లేష్ యాదవ్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఐలబోయిన రమేష్ యాదవ్ ఈ మేరకు మల్లేష్ యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ పదవి అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమించినందుకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబు రావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రమేష్ యాదవ్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గొర్ల యశ్వంత్ యాదవ్ లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. యాదవ సంస్కృతిని కాపాడే విధంగా తగిన కృషి చేస్తానని, పాడిపశువులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా యాదవులు లబ్దిపొందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే రాష్ట్ర యువ అధ్యక్షుడు ఆదేశాలమేరకు ప్రతి జిల్లాలోని యువ యాదవుల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం శేరిలింగంపల్లి కార్పొరేటర్, యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి రాగం నాగేందర్ యాదవ్ , యాదవ మహాసభ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గొర్ల యశ్వంత్ యాదవ్ లకి కృతజ్ఞతలు తెలిపారు.