శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అక్రమంగా చేపట్టిన రెండు భవన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన రెండు అక్రమ నిర్మాణాలను శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. సర్కిల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ, సీ బ్లాక్ లలో కొనసాగుతున్న సదరు అక్రమ నిర్మాణాలను డీసీ ప్రశాంతి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకట రమణ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టి టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించాలన్నారు.






