హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హఫీజ్ పేట డివిజన్ బరిలో ఎంఐఎం పార్టీ నుంచి సీమా అహ్మద్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డివిజన్ మహిళా రిజర్వేషన్ కావడంతో తన మేనకోడలు సీమా అహ్మద్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ నాయకుడు ఇమ్రాన్ అహ్మద్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయంలో ఆమె బయోడేటాను అందజేశారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమకు టిక్కెట్ అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో శేరిలింగంపల్లిలో పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నామని, అందువల్ల అసదుద్దీన్ ఓవైసీ తమకు టిక్కెట్ ఇస్తారనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

