శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మియాపూర్ ఓంకార్ నగర్ లో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (AIFDW) ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సంఘ రాష్ట్ర కోశాధికారి తాండ్ర కళావతి గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వల్లేపు వనిత మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేసిన మహోన్నత సంఘ సంస్కర్త అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘము గ్రేటర్ కమిటీ సభ్యులు విమల, సుల్తానా బేగం, శివాని, లలిత, పార్వతి, స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు.