శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ఉన్న భగవాన్ శ్రీ సత్య సాయి మందిర ప్రాంగణంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 99 వ జన్మదినం సందర్భంగా జరిగిన మహా నారాయణ సేవ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు, నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, గంగాధర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.