నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి గౌడ సంఘం ఆహ్వానం మేరకు మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో పాపన్న విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ఆయనను స్మరించుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తిని గుర్తుచేసుకోవడం కాద‌ని, ఒక విప్లవ భావజాలాన్ని, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని స్మరించుకోవడం అని అన్నారు. తెలంగాణ చరిత్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిరంకుశత్వాన్ని ఎదిరించి సామాన్యుల పక్షాన నిలిచిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ గౌడ్, నాగులు గౌడ్, రాజేష్ గౌడ్, యాదగిరి గౌడ్, అనిల్ గౌడ్, జితేందర్, జగన్ గౌడ్, విష్ణు దత్, శ్రీధర్ గౌడ్, గణేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, అశోక్, రవి ముదిరాజ్, శివారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here