సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల బంద్‌ను విజ‌య‌వంతం చేయాలి: బీసీ సంఘాల నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘాల సమన్వయ కమిటీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316 వర్ధంతి సభ సంద‌ర్భంగా అంబాల నారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, బహుజన బతుకమ్మ, విప్లవ గాయని విమలక్క, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ పాల్గొని మాట్లాడుతూ పాపన్న సామాన్య కల్లుగీత వృత్తి తిచేసుకుంటూనే బహుజన రాజ్యాన్ని నిర్మించిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాదని కొనియాడారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని నాడే వేల బహుజన సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క కోటకు ఒక్కొక్క బహుజనులను రాజుగా తయారుచేసిన గొప్ప చక్రవర్తి అని చరిత్రను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు ఎస్ దుర్గ గౌడ్, బైరు శేఖర్, బత్తిని కీర్తి లతా, యెలికట్ట్ విజయ్ కుమార్ గౌడ్, లింగేశ్‌ యాదవ్, సింగం నాగేశ్వర్, చెన్న శ్రీకాంత్ నేత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here