శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ దేవాలయం లో నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బలమూ, ధైర్యమూ, పరాక్రమానికి మారుపేరు హనుమాన్ అని అన్నారు. హనుమాన్ జయంతి, వానర దేవుడు, శ్రీరాముని అమిత భక్తుడైన హనుమంతుని జన్మ జ్ఞాపకార్థం జరుపుకుంటారని, చైత్రమాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారని, హనుమంతుడిని ఆరాధించడం వల్ల దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని, చెడుపై విజయం సాధించడంలో సహాయ పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ వీరాంజనేయ దేవాలయ కమిటీ సభ్యుడు శ్రీరామ్ నాయక్, బ్రిక్స్ స్కైవుడ్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , సెక్రెటరీ బి ఆర్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, ప్రకాశ్, మణి, శ్రీశైలం, ఉమ మహేష్, వినయ్, గోవర్ధన్, గోపనపల్లి తండా గ్రామస్థులు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





