నమస్తే శేరిలింగంపల్లి: 75 సంవత్సరాల భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చందానగర్ లోని సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. 300 మంది విద్యార్థులతో చందానగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ శాంతి నగర్, శివాజీ నగర్, ఇందిరానగర్, మంజీరా రోడ్డు వరకు దేశ భక్తి నినాదాలతో కొనసాగింది. అనంతరం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర్య సాధన, స్వాతంత్రోద్యమకారుల ఔన్నత్యంపై విద్యార్థులకు అర్థమయ్యేలా పలువురు ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ మూగల రఘునందన్ రెడ్డి, సహ కార్యదర్శి రామచంద్రారెడ్డి, ట్రెజరర్ నాగభూషణ రావు, సభ్యులు గాలి రెడ్డి, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు.