సత్యసాయి సేవా సమితి అనాథాశ్రమంలో పండ్లు పంచిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని సత్య సాయి సేవా సమితి అనాథ ఆశ్రమంలో వృద్ధులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి గాంధీ పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ మోతి, స్థానిక కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి అనాథ ఆశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‌గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు సత్య సాయి సేవా సమితి అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటడం జరిగిందన్నారు. బ్రిటీష్ వలస పాలనను పారదోలాలనే మహా సంకల్పంతో భారత స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది స్వాతంత్ర్య ‌యోధులు ప్రాణాలర్పించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీ బాయి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, హఫీజ్ పెట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, మాదాపూర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, అన్వర్ షరీఫ్, దొంతి శేఖర్, రఘునాథ్, కాజా, కంది జ్ఞానేశ్వర్, పద్మారావు, మల్లేష్, శివ రోజా, కల్పన తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి సేవా సమితి అనాథాశ్రమంలో మొక్కలు నాటుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here