నమస్తే శేరిలింగంపల్లి: హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉన్న కొండాపూర్, ఇజ్జత్ నగర్, తదితర బస్తీల్లో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణ వాపోయారు. వారం రోజుల నుండి మంచినీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కనీసం ట్యాంకర్లతోనైనా మంచినీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు.